
తుని :- మాజీ ఆర్ధిక మంత్రి యనమల రామకృష్ణుడు విజయలక్ష్మి దంపతుల వివాహ వార్షిక వేడుక నిరాడంబరంగా జరిగింది. కాకినాడ జిల్లా తుని మండలం తేటగుంట క్యాంప్ కార్యాలయంలో యనమల దంపతులు మ్యారేజ్ డే కేక్ ను కట్ చేసారు.అనంతరం తొండంగి మండలం ఏవీ నగరంలోని శ్రీ శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వేంకటేశ్వరస్వామి వారి దేవస్థానంను సీనియర్ నేత యనమల నాగేశ్వరరావు తో కలిసి సందర్శించారు.శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకున్న యనమల దంపతులు విశేష పూజలు నిర్వహించి తీర్ధ ప్రసాదాలు స్వీకరించారు.



