
కాకినాడ :- స్వచ్ఛమైన ఓటరు జాబితాల రూపకల్పన లక్ష్యంగా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్ ) ప్రక్రియను జిల్లాలో పటిష్టంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ ఈఆర్ఓలు ఏఈఆర్ఓలను ఆదేశించారు.కేంద్ర ఎన్నికల కమీషన్ ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం కాకినాడ జిల్లాలో ఓటరు జాబితాల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియ శుక్రవారం ప్రారంభం అయింది.ఈ నెల 5 నుండి 14వ తేదీ వరకూ ఓటరు నమోదు అధికారులు బూత్ స్థాయి అధికారులకు నిర్వహణ సన్నద్దత శిక్షణ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.ఇందులో భాగంగా శుక్రవారం కలెక్టరేట్ వివేకానంద సమావేశ హాలులో ఈఆర్ఓలు,ఎఈఆర్ఓ లకు నిర్వహించున శిక్షణా కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ఎం.ఎన్.హరేంధిర ప్రసాద్ హాజరై అధికారులకు సర్ ప్రక్రియ నిర్వహణపై సూచనలు ఆదేశాలు జారీ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడూతూ సర్ పక్రియను 1 జాలై 2026 క్వాలిఫైయింగ్ గా ఓటరు జాబితాల సమగ్ర సవరణ నిర్వహించాలని తెలియజేశారు.బిఎల్ఓ లకు ఈ ప్రక్రియ నిర్వహణపై సమగ్ర శిక్షణ కల్పించి ఈ నెల 15వ తేదీ నుండి జూలై 14వ తేదీ వరకూ 30 రోజుల పాటు హౌస్ టు హౌస్ ఓటర్లను సందర్శన ద్వారా ఎన్యూమరేషన్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు.జూలై 21వ తేదీన ముసాయిదా జాబితాలను ప్రకటించాలని వాటిపై జూలై 21 నుండి ఆగష్టు 20 వరకూ క్లెయిములు అభ్యంతరాలు స్వీకరించాలని జూలై 21 నుండి సెప్టెంబరు 18 వరకూ నోటీసుల దశ క్లెయిములు అభ్యంతరాల పరిష్కారం నిర్వహించి సెప్టెంబరు 22 న తుది ఓటరు జాబితా ప్రచురించడం జరుగుతందని తెలిపారు.అర్హులైన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేయడం అనర్హులను డూప్లికేట్ ఎంట్రీలను చనిపోయిన వేరొక ప్రాంతానికి తరలిపోయిన వారిని తొలగించడం లక్ష్యంగా ఈ ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియను ఎన్నికల కమీషన్ నిర్థేశాల ప్రకారం సమర్థవంతంగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ అధికారులను ఆదేశించారు.ఈ కార్యక్రమంలో డిఆర్ఓ డి.టిప్పేనాయక్ కాకినాడ ఆర్డిఓ ఎస్.మల్లిబాబు పెద్దాపురం ఆర్డిఓ పి.కృష్ణమూర్తి బిసి కార్పొరేషన్ ఈడి శ్రీనివాసరావు జిజిహెచ్ పరిపాలనాధికారి ఎన్.శ్రీధర్ అధికారులకు సర్ ప్రక్రియ నిర్వహణ అంశాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అధికారులకు వివరించారు..


