వారసత్వ భూమి విషయంలో న్యాయం చేయాలని బాధితుల విజ్ఞప్తి…

కాకినాడ :- భూమి రికార్డులపై సమగ్ర విచారణ జరిపి న్యాయం చేయాలని ప్రభుత్వానికి బాధితులు విజ్ఞప్తి చేసారు.ఈ అంశానికి చెందిన వివరాలు ఇలా ఉన్నాయి.కాకినాడ జిల్లా కలెక్టర్ కి సోమవారం జరిగే పి జి ఆర్ ఎస్ వచ్చిన పిర్యాదు మేరకు స్పందించిన కలెక్టర్ విచారణ చేయించి బాధితులకు న్యాయం చేయాలని ఈ విషయమై అధికారులను ఆదేశించారు.అలాగే అక్రమాలకు పాల్పడిన అధికారులపై తగిన చర్యలు చేపట్టాలని సూచించారు.తమ వారసత్వ భూమిని వారసులకు చెందకుండా వేరోకరిపేరు మీద ఆన్లైన్లో నమోదు చేయడం చాలా అన్యాయమని కరప మండలం సిరిపురం గ్రామానికి చెందిన నున్న వీర వెంకట రమణ అనే బాధితురాలు ఆరోపించారు. ఆమె శుక్రవారం పెదపూడి తహసీల్దార్ కార్యాలయానికి వచ్చి ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై సంబంధిత అధికారులను ప్రశ్నిస్తుండగా సరైన సమాదనం ఇవ్వలేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె మీడియాకు తెలియజేసిన వివరాలు ఇలా ఉన్నాయి. సంపర గ్రామానికి చెందిన తిబిరిశెట్టి శేషమ్మ తన అమ్మమ్మ అని తెలిపారు. శేషమ్మ భర్త రూపులయ్య పేరుమీద సంపర గ్రామంలో  భూమి ఖాతా నెం.6సర్వే నెం.583-3లో 0.46 ఎకరాల77లో నమోదై ఉందన్నారు. అలాగే ఆన్ అండ్ సర్వే నెం. 383-2, ఎల్పీఎం నెం.1928,రీసర్వే ప్రకారం 0.46 ఎకరాల ఉందన్నారు.శేషమ్మకు వడ్డీ వీర రామలక్ష్మి, చల్లా సూర్య నారాయణమ్మ ఇద్దరు కుమార్తెలు ఉన్నారన్నారు. తిబిరిశెట్టి శేషమ్మ మరణానంతరం ఆమె ఆస్తి ఇద్దరు కుమార్తెలకు చెందాల్సి ఉందన్నారు. అనంతరం తన తల్లి వడ్డీ వీర రామలక్ష్మి మరణించడం తో ఆమె వారసులైన తాను( నున్న వెంకటరమణ),తిరుమలశెట్టి సూర్య ప్రభావతి మాదిరెడ్డి వీరవేణి మర్రిశెట్టి సాయి లీలలు చట్టబద్ధ వారసులుగా హక్కు పొందాల్సి ఉందన్నారు.ప్రస్తుతం తన పిన్ని చల్లా సూర్యనారాయణమ్మ జీవించి ఉన్నారన్నారు. అయితే ఈ భూమిని చట్టబద్ధ వారసులైన తమ నలుగురు సోదరులు సోదరీ మణులు తమ పిన్ని చల్లా సూర్య నారాయణమ్మ పేర్లపై సమాన వాటాలుగా నమోదు చేయాలని అనేకసార్లు పెదపూడి తహసీల్దార్ కి వినతి పత్రాలు అంద చేశామన్నారు. అయినప్పటికి అధికారులు స్పందించలేదని ఆరోపించారు. సెప్టెంబర్ మూడో తేదీ 2023 సంవత్సరంలో స్పందన కార్యక్రమంలో ఫిర్యాదు చేసినప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదని తెలిపారు.అలాగే అనేక మార్లు మౌఖికంగా లిఖిత పూర్వకంగా వినతులు సమర్పించినప్పటికీ తమకు న్యాయం చేయలేదన్నారు. ఈ నేపథ్యంలో పెదపూడి తహసీల్దార్ సంపర గ్రామ రెవెన్యూ అధికారి కలిసి ఏకపక్షంగా వ్యవహరించి 2025 సంవత్సరం డిసెంబర్ 23 వ తేది న మ్యుటేషన్ నెం. ఎంఎల్ పీఎం 251206025164 ద్వారా మొత్తం భూమిని చల్లా సూర్యనారాయణమ్మ పేరు పై నమోదు చేసి కొత్త పాసుబుక్ జారీ చేశారని ఆరోపించారు.ఆనంతరం ఖాతా నెం. 3371ను కూడా ఆమె పేరుపై కేటాయించి నట్లు పేర్కొన్నారని తెలిపారు. దీంతో తమ నలుగురు చట్టబద్ధ వారసులకు రావలసిన హక్కులను కాలరాస్తూ అధికారుల సహకారం తో తమ పిన్ని సూర్య నారాయణమ్మ పేరు మీదే భూమిని నమోదు చేశారని బాధితులు ఆరోపించారు. అంతేకాకుండా టి.రాంబాబు అనే వ్యక్తికి భూమి విక్రయించినట్లు గ్రామ రెవెన్యూ అధికారి రికార్డుల్లో నమోదు చేసినట్లు తెలిపారు.దీనిపై పలు అనుమానాలు ఉన్నాయని వారు ఆరోపించారు. తమ చట్టబద్ద వారసులకు చెందాల్సిన భూమి అందరికి చెందే విధంగా చేయడానికి సమస్య పరిష్కారానికి రూ.1లక్ష లంచం అప్పట్లో పనిచేసిన వీఆర్వో శ్రీరామ్, తహసీల్దార్ ఆదేశాల పై సిరిపురం గ్రామంలో ఇంటికి వచ్చి మరి డిమాండ్ చేశారని వారు తెలిపారు. ఈ వ్యవహారంపై జిల్లా కలెక్టర్ రెవెన్యూ ఉన్నతాధికారులు సమగ్ర విచారణ నిర్వహించి భూ రికార్డులు వారసత్వ హక్కులు మ్యుటేషన్ ప్రక్రియలను పరిశీలించి తమ నలుగురు వారసులకు న్యాయం చేయాలని బాధితులు శుక్రవారం విజ్ఞప్తి చేశారు. అలాగే అవినీతి నిరోధక శాఖతో పాటు ఉన్నతాధికారులు విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరారు…

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment