ఫ్లెక్సీ ప్రింటింగ్ యూనిట్ ను ప్రారంభించిన మర్రి రాజశేఖర్…

చిలకలూరిపేట :- పట్టణ తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు, పద్మశాలియ సంఘ ముఖ్య నాయకులు అవ్వారు బసవయ్య ద్వితీయ కుమారుడు నాగరాజు నూతనంగా ఏర్పాటు చేసిన “భావన ఫ్లెక్సీ ప్రింటింగ్ యూనిట్” ప్రారంభోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా శాసనమండలి సభ్యులు మర్రి రాజశేఖర్ హాజరై యూనిట్‌ను ప్రారంభించరు. మర్రి రాజశేఖర్ మాట్లాడుతూ, మీరు ప్రారంభించిన ఈ వ్యాపారం విజయవంతంగా ముందుకు సాగి, మరింత అభివృద్ధి చెంది ఇంతకు పదింతలు లాభాలు ఆర్జించేలా భగవంతుని ఆశీస్సులు ఎల్లప్పుడూ మీతో ఉండాలని ఆకాంక్షిస్తున్నానని అన్నారు.అలాగే వారి మరో సంస్థ భావన లేడీస్ టైలర్స్ & కంప్యూటర్ – ఎంబ్రాయిడరీ మగ్గం వర్క్స్ ను కూడా సందర్శించి వారిని అభినందించి,వ్యాపార రంగంలో మరింతగా అభివృద్ధి సాధించాలని ఆకాంక్షించారు.ఈకార్యక్రమంలో వారివెంట గేరా లింకన్, అవ్వారు పెద మస్తాన్, జంజనంవెంకట్రావు, గ్రంది ఆంజనేయులు, జల్లెడ గణేష్,అందెల శౌరి,వూట్ల సాంబమూర్తి,షేక్ కరిముల్లా,దుర్గప్రసాద్,హౌ ఆర్ నవీన్,నందం తిరుపళ్ళు,అవ్వారు వెంకటేష్,అవ్వారు సాయి కుమార్ తదితరులున్నారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment