
ఘనంగా గంధమహోత్సవం..
ప్రత్యేక ప్రార్థనలు చేస్తున్న మత గురువులు..
గూడూరు :- పట్టణంలో వెలసి ఉన్నటువంటి హజరత్ సయ్యద్ హాషిమ్ హుస్సేనీ జాఫర్ మస్తాన్ ఔలియా వారి గంధ మహోత్సవం అత్యంత భక్తిశ్రద్ధలతో మత గురువుల ప్రత్యేక ప్రార్థనలతో పూలు విద్యుద్దీప అలంకరణములతో నందలూరు ఫకీర్ల జరబు విన్యాసములతో శనివారం రాత్రి జరిగింది ఈ గంధ మహోత్సవానికి గూడూరు పట్టణానికి చెందిన వారే కాకుండా తమిళనాడు తెలంగాణ నుండి కూడా భక్తులు విచ్చేశారు దర్గా వెల్ఫేర్ కమిటీ ఆధ్వర్యంలో అధ్యక్షులు రియాజ్ అహ్మద్ సారధ్యంలో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా తగు జాగ్రత్తలు చేశారు ముందుగా అధ్యక్షులు రియాజ్ అహ్మద్ ఇంటి నుండి గంధాన్ని ఊరేగింపుగావించి దర్గా వద్దకు చేర్చి ప్రత్యేక ప్రార్థనలు మత గురువుల ప్రార్ధనల అనంతరం గంధాన్ని హజ్రత్ వారి సమాధికి లేపనం చేశారు దర్గా పెద్ద ముజావర్ మగ్దూమ్ ప్రత్యేక దువా ఫాతేహ జరిపిన అనంతరం దర్గా ఆవరణంలో వజ్రాల తాహిర్ ఫ్రూట్ మర్చంట్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా దర్గా కమిటీ అధ్యక్షులు రియాజ్ అహ్మద్ గౌరవ అధ్యక్షులు లయన్ షేక్ రియాజ్ అహ్మద్ లు మాట్లాడుతూ మత సామరస్యానికి నిదర్శనం గూడూరు గంధమహోత్సవం అని అన్నారు కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ దర్గాను సందర్శించుకుంటూ ఉంటారని ఒకరికొకరు సోదర భావంతో కలిసి మెలసి గంధమహోత్సవంలో పాల్గొంటారని ఆనందం వ్యక్తం చేశారు, దర్గా కు విచ్చేసినటువంటి ప్రతి ఒక్కరూ క్షేమంగా వారి వారి ఇళ్లకు వెళ్లాలని వారు అనుకున్నవి అల్లాహ్ దయవలన నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానని అన్నారు.దర్గా ముజావర్ మత గురువు మగ్దూమ్ అలీషా చిష్టి ఉల్ ఖాదరి మాట్లాడుతూ ప్రతి సంవత్సరం గూడూరు పట్టణంలో హజరత్ సయ్యద్ హాషిమ్ హుస్సేనీ బాబా వారి దర్గా నందు బక్రీద్ మాసంలో హజరత్ సయ్యద్ హాషిమ్ హుస్సేని బాబా వారి గ్రంథం జరుగుతుందని ఈ గంధమహోత్సవానికి దర్గా కమిటీ అధ్యక్షులు షేక్ రియాజ్ అహ్మద్, గౌరవ అధ్యక్షులు లయన్ షేక్ రియాజ్ అహ్మద్ ల సూచనల మేరకు కమిటీ సభ్యుల పర్యవేక్షణలో భక్తుల నడుమ అత్యంత భక్తి శ్రద్దలతో గంధ మహోత్సవం జరిగిందని ముఖ్యంగా మిత్రుడు తాహిర్ పండ్ల వ్యాపారి వారికి దర్గా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నామని అన్నారు ఈ కార్యక్రమంలో దర్గా కమిటీ అధ్యక్షులు రియాజ్ అహ్మద్,లయన్ రియాజ్ అహ్మద్,మగ్దూమ్,ఇలియాజ్ అహ్మద్, హఫీజ్ అహ్మద్,షానవాజ్,షిరాజ్ అహ్మద్,షబ్బీర్,యస్దాని,సందాని బాష,గోల్డెన్ గౌస్,సైదులు, మత గురువులు మగ్దూమ్ అలీషా చిష్టి ఉల్ ఖాదరి,ఖదీర్ అలీ షా చిష్టి ఉల్ ఖాదరి,దిల్దార్ అలీషా బాసిత్ తమిళనాడు, మజహర్ అలీషా అబ్దుల్లా,గౌస్ మస్తాన్
ఖాదరి,రహమాన్ అలీషా తిరుపతి,ఫర్మాన్ అలీ షా,సలీం చిష్టి,నూర్ అలీ షా, హైదర్ అలీ షా,అబ్దుల్లా,నసీర్ తదితరులు పాల్గొన్నారు.



