
రంపచోడవరం :- పోలవరం జిల్లా అడ్డతీగల మండలం భీముడు పాకలు వద్ద ఆదివారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో బంధం గంగరాజు 20 సంవత్సరాలు అనే యువకుడు మృతి చెందాడు .భీముడు పాకలు గ్రామ సమీపమున గల బంధం వారి పాకలు కు చెందిన గంగరాజు భీముడు పాకలు వెళ్లి వస్తు దారిలో ట్రాక్టర్ ఎక్కినాడు.అతడు ప్రమాదవశాత్తు కింద పడడంతో ట్రాక్టర్ టైరు అతని తలపై నుంచి ఎక్కేయడంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు.పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు…



