
ఎస్.రాయవరం :- మండలంలోని సైతారుపేట గ్రామంలో శ్రీఆంజనేయస్వామి వార్షిక ఉత్సవాలలో భాగంగా ఆదివారం జిల్లాస్థాయి ఎడ్లబండ్ల పోటీలను నిర్వహించారు.జిల్లాలోని వివిధ ప్రాంతాలునుండి వచ్చినవారు ఈపోటీలలో పాల్గొన్నారు.ఈ పోటీలను విక్షీంచేందుకు సైతారుపేట సమీప గ్రామాలప్రజలు భారీసంఖ్యలో తరలివచ్చారు.జాతర సందర్బంగా నిర్వహించిన ఈ పోటీలలో విజేతలుకు నగదు పురష్కారంతో పాటు జ్ఞాపికలును అందచేసారు.ప్ధమబహుమతిగా 15 వేలరూపాయలును వల్లంపూడికిచెందిన సిద్ధవినాయక టీంకుదక్కగా, ద్వితీయ బహుమతి చుక్కపల్లి ఎడ్లబండి కి 13 వేల రూపాయలు,తృతీయ బహుమతి 10 వేల రూపాయలు సింహాద్రి పురంకు అందచేసారు.ఈ కార్యక్రమం లో మాజీసర్పంచ్ రావి రమణ బాబు,మండల టిడిపి అధ్యక్షడు అమలకంటి అబద్ధం,ఎంపిటిసి సేనాపతి రాము,మాజీ సర్పంచ్ వీసం గోవిందు,స్థానిక నాయుకులు వీసం అప్పలస్వామి నాయుడు,కుంచాల అప్పారావు,రావిశసతీష్ తదితరులు పాల్గొన్నారు.ఆంజనేయ స్వామి ఉత్సవాల్లోభాగంగా స్వామివారికి సామూహిక అభిషేకాలు,పూజలు నిర్వహించారు.భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు…



