
అచ్చుతాపురం ఇంటిగ్రేటెడ్ మానసిక వికలాంగుల ఆశ్రమం కు నిత్యవసర సరుకులు అందజేత…
అనకాపల్లి ప్రతినిధి :-అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో గల ఇంటిగ్రేటెడ్ మానసిక వికలాంగుల పిల్లల ఆశ్రమం కు అనకాపల్లి మాతృభూమి సంఘం,విటిసి హెల్ఫింగ్ హాండ్స్ సంయుక్త అధ్వర్యంలో నిత్యవసర సరుకులు అందజేయడం జరిగింది.ఆ రెండు సంస్థల ప్రతినిధులు ఆదివారం 10 బస్తాలు బియ్యం,రెండు నూనె డబ్బాలు,15 కేజీ లు కందిపప్పు,5 కేజీల చింతపండు ఇంటిగ్రేటెడ్ మానసిక వికలాంగుల ఆశ్రమం కు అందజేశారు .అనంతరం మాతృభూమి సేవా సంఘం వ్యవస్థాపక కార్యదర్శి ఇప్పలవలస గోపాలరావు, మాతృభూమి సేవా సంఘం అనకాపల్లి జిల్లా అధ్యక్షులు అల్లక రాజు మాట్లాడుతూ ప్రతి నెల నిత్యవసర సరుకులు అందజేయం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమం లో ఎల్.వి రమణమూర్తి ,సీతారామ్ ,బ్రహ్మానందం,శ్రీనివాస్ రాజు ,జగన్మోహన్ త్రినాథ్ పట్నాయక్ చంద్ర శేఖర్ ,నీలకంఠ ప్రసాద్ పట్నాయక్ తదితరులు పాల్గొన్నారు…



