
ప్రొహిబిషన్ & ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ వి రవికుమార్ వెల్లడి …
నెల్లిమర్ల:- భోగాపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోగల అనధికార మద్యం దుకాణాలపై (బెల్ట్ షాపులపై) దాడుల్లో భాగంగా శనివారం కొప్పెర్ల గ్రామ పరిది పూసపాటిరేగా మండలం లో ఒక వ్యక్తి వద్ద 07 మద్యం 180 ఎమ్మెల్ పరిమాణం గల బాటిల్స్ తో అరెస్ట్ చేసి కేసు నమోదు చేయబడినదని ఎక్సైజ్ సీఐ బి రవికుమార్ ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇకపై ఎవరూ అనధికారి మధ్య దుకాణాలు (బెల్ట్ షాపులు) నిర్వహించరాదని మరియు ప్రోత్సహించరాదని,అనధికారి మద్యం దుకాణాలు (బెల్ట్ షాపులు) యొక్క సమాచారాన్ని భోగాపురం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ వారికి తెలియజేయవలెనని,సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచబడునని సూచించారు.ఈ దాడుల్లో ఎస్సై చంద్రమోహన్,హెడ్ కానిస్టేబుల్స్ సత్యనారాయణ మరియు కానిస్టేబుల్ మహేష్,శిరీషాలు పాల్గొన్నారు…



