
కె .కోటపాడు :- మండలంలో మేడిచర్ల ఉన్నత పాఠశాలలో గత సంవత్సరం 10వ తరగతిలో శతశాతం ఉత్తీర్ణత సాధించిన పాఠశాలగా నిలిచింది.ఇటువంటి పాఠశాలలో మీ విద్యార్థులను చేర్పించినట్లయితే ఉన్నత విద్యను అందించేందుకు ఉపాధ్యాయని,ఉపాధ్యాయులు సిద్ధంగా ఉన్నారని మండల విద్యాశాఖ అధికారి కె .సత్యనారాయణ అన్నారు.అడ్మిషన్ డ్రైవ్ సందర్భంగా మేడిచర్ల ప్రభుత్వ పాఠశాలలో విద్యార్థులను చేర్పించినట్లయితే ఉన్నత స్థాయిలో విద్యను అందించేందుకు మా సిబ్బంది సిద్ధంగా ఉన్నారని విద్యాశాఖ అధికారి సత్యనారాయణ విద్యార్థుల తల్లిదండ్రులతో, గ్రామ పెద్దలతో మాట్లాడారు.ప్రభుత్వ పాఠశాలలో మీ పిల్లలు చదువుకున్నట్లయితే ఎటువంటి ప్రభుత్వ రాయితీలకు అయినా మరియు ప్రభుత్వ పాఠశాలలో ట్రిపుల్ ఐటి లాంటి ఉన్నత విద్యకు ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అధికారి కే సత్యనారాయణ తో పాటు పాఠశాల ఇంచార్జ్ ప్రధానోపాధ్యాయులు జీ వీ యన్ శివానంద ఉపాధ్యాయులు నాయుడు,వెంకటరమణ,నారాయణమ్మ,పద్మజ,పద్మావతి,జానకిలతో పాటు గ్రామ సర్పంచ్ పూడి నారాయణమూర్తి, గ్రామ పెద్దలు, ఓల్డ్ స్టూడెంట్స్ పాల్గొన్నారు.



