
పి గన్నవరం :- మామిడి కుదు రు ఈదరాడలో తాళాలు వేసిన ఇళ్లే టార్గెట్ గా చేసుకుని దొంగలు చోరీకి పాల్పడ్డారు. రెండు ఇళ్లలో చోరీయత్నం జరిగింది ఒక ఇంట్లో ఏ విధమైన వస్తువులు లేకపోవడంతో ఇంట్లో సామాన్లను చిందర వందరగాపడేసి వెళ్లిపోయారు మరొక ఇంట్లో బీరువాలో భద్రపరిచిన వెండి వస్తువులను అపహరించారు ఈ చోరీలకు సంబంధించి స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆకుల విజయశ్రీ రాములు 20 రోజుల క్రితం కుటుంబ సభ్యులతో కలిసి హైదరాబాదు వెళ్లారు ఇంట్లో ఎవరూ లేని విషయం గమనించి దొంగలు ఆ ఇంటి ని టార్గెట్ చేశారు ఆ ఇంటి తాళాలు బద్దలు కొట్టి చోరీకి పాల్పడ్డారు ఈ విషయం వెలుగులోకి వచ్చింది బాధితుడు గురువారం హైదరాబాదు నుంచి వచ్చారు అతని సమక్షంలో క్లూస్ టీమ్ ఆధారాలు సేకరించింది బీరువాలు బదలు గొట్టి వాటిలోని వెండి వస్తువులను అపహరించారు బంగారం వస్తువులు లాకర్ ఓపెన్ కాలేదని చెబుతున్నారు దానికి దగ్గరలోనే ఉన్నా రిటైర్డ్ టీచర్ యెనుముల భాస్కర రామ్మూర్తి ఇంటి తాళాలు కూడా బద్దలు కొట్టి చోరీకి ప్రయత్నించారు కానీ ఆ ఇంట్లో ఏ విధమైన వస్తువులు లభించకపోవడంతో ఇంట్లో సామాగ్రిని చల్లాచెదురు గా విసిరేసి వెళ్లిపోయారు ఈ రెండిటిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని నగరం ఎస్సై ఎ చైతన్య కుమార్ తెలిపారు ఇల్లు విడిచి బంధువులు ఇళ్ళకి వెళ్లేవారు అప్రమత్తంగా ఉండాలన్నారు…



