
అక్రమ చెరువుల పై స్టేటస్ కో ఆర్డర్ ను జారీచేసిన హైకోర్టు…
అయినవిల్లి :- డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా అయినవిల్లి మండలం నేదునూరు గ్రామంలో కొంత మంది భూస్వాములు అడ్డగోలుగా ఆక్వా చెరువులు తవ్వడం పట్ల కొంత మంది రైతులు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గ్రీవెన్సులో ఫిర్యాదు చేసారు.అయితే దీనిపై జిల్లా అధికారులు మండల అధికారులకు రైతుల పెట్టుకున్న ఫిర్యాదులను పంపించినా అధికారులు పట్టించుకోలేదని రైతులు తెలిపారు.అయినప్పటికి రైతులు రొయ్యల చెరువులు తవ్వకాలు ప్రారంభించడంతో రైతులు మళ్ళీ తవ్వకాలను అడ్డున్నారు.రాత్రుల సమయంలో చెరువులు తవ్వి పగలు తుప్పల్లో పెడుతున్నారని ఈ క్రమంలో రైతులు హైకోర్టు ను ఆశ్రయించగా హైకోర్టు గురువారం స్టేటస్ కో ఆర్డర్ ను ఇచ్చినట్లు రైతులు తెలిపారు.ఈ ఆర్డర్ ప్రకారం ప్రస్తుతం ఎలాఉన్న భూమిని అలానే ఉంచాలి ఆ భూముల్లో ఏ మైనా పనులు చేసినట్టు రుజువు అయితే కోర్టు దిక్కరణ కేసుగా పరిగణించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది.ఆక్వా చెరువులు తవ్వాలంటే నిబంధనలు ప్రకారం వ్వవసాయశాఖ,మత్స్య శాఖ,ఇరిగేషన్,రెవెన్యూ అధికారులు అనుమతులు తప్పనిసరి.అయితే ఈ అక్రమ చెరువులు తవ్వే వారికి ముగ్గురు వ్వక్తులకు మాత్రమే మత్స్య శాఖ అనుమతులు మాత్రమే ఉన్నాయి . రెండు జేసిబి మిషన్లుతో రాత్రుల సమయంలో మాత్రమే చెరువులు తవ్వి పగలు తుప్పల్లో పెడుతున్నారని రైతులు అరోపిస్తున్నారు. 2020 యాక్టు కు విరుద్ధంగా ఇచ్చిన పర్మిషన్లు రద్దు చేయాలని పలువురు రైతులు గత కొన్ని రోజులు గ జిల్లా కలెక్టర్ కు తహశీల్దారు కు ఫిర్యాదు చేశారు. అయితే అధికారులు పట్టించు కోలేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇదే ప్రాంతంలో ముక్కామల వేణుగోపాల్ స్వామి భూమి కూడా ఉంది ప్రక్కనే ఉప్పు నీటి చెరువులు తవ్వితే రెండు పంటలు పండే భూములు నాశనం అవుతాయని సుమారు 100 మంది రైతులు పిర్యాదు చేశారు అయినా త్రవ్వుట కు ప్రయత్నాలు చేయడం తో బాధితులు జీ.సి.బి లను అడ్డుకున్నారు.బాధిత రైతులు హైకోర్టు అడ్వకేట్లు ఏం.వి.సుబ్బారావు రామ శంకర్ లను ఆశ్రయించడం తో గురువారం హైకోర్టు ముందు వాదనలు వినిపించారు.దీనిపై హైకోర్టు స్టేటస్ కో మెంటెయిన చేయమని ఎలా ఉన్నది అలా ఉంచాలని రెవెన్యూ పోలీస్ మత్యశాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేశారు…



