3.5 కోట్ల రూపాయలతో అనకాపల్లి లో శాశ్వతంగా గ్రోయిన్ ల మరమ్మత్తులు…అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ

అనకాపల్లి గుండాల జంక్షన్ సమీపంలోని ఆర్ ఓ కార్యాలయం లో మంగళవారం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జన వనరుల శాఖ అధ్వర్యంలో నీటి భద్రత సాగునీటి సంఘాలు బాధ్యత కార్యక్రమం నిర్వహించారు. అనకాపల్లి నియోజకవర్గం లో శాశ్వతంగా గ్రోయిన్ లు మరమ్మత్తు పనులు నిర్వహణకు 3.5 కోట్ల రూపాయలు మంజూరయ్యాయి. ఈ సందర్భంగా అనకాపల్లి గ్రేటర్ విశాఖపట్నం అధికారులు, సాగునీటి వినియోగదారుల సంఘాల అధ్యక్షలు, ఉపాధ్యక్షులు, టి.సి.మెంబర్లతో మాజీమంత్రి, అనకాపల్లి శాసనసభ్యులు కొణతాల రామకృష్ణ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నీటి సంఘ వినియోగదారుల సంఘాల అధ్యక్షుల సమస్యలను తెలియజేయడం జరిగింది. ఈ సమస్య లపై ఎమ్మెల్యే రామకృష్ణ స్పందించి, ఆదికారులతో ఆయన మాట్లాడి పరిష్కరించే విధంగా చర్యలు చేపట్టడం జరిగింది . అనంతరం ఎమ్మెల్యే రామకృష్ణ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు , ఉపముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ ల ముఖ్య ఉద్దేశం వ్యవసాయానికి పెద్దపీట వేయాలన్నదేనన్నారు. వ్యవసాయం లేకపోతే ఎవరూ ఉండరని, అందుకే అన్నిటికంటే ముందు వ్యవసాయానికి ప్రాధాన్యత ఇచ్చి తీరాలనే ఉద్దేశ్యంతో ఉన్నారని, రైతు నవ్వుతూ ఉండాలి. రైతు నవ్వడానికి కాస్త నీరు అందితే చాలు సంతోషంగా ఉంటాడన్నారు. వీటన్నిటి దృష్ట్యా ఈ ప్రభుత్వం మంజూరు చేసిన 3 కోట్ల 50 లక్షలు సద్వినియోగపరిచి, శాశ్వతంగా గ్రోయిన్స్ అన్నీ మరమ్మత్తులు చేయడం జరుగుతుందన్నారు. అలాగే గోడారి, తగరంపూడి ల వద్ద ఆనకట్టలు కట్టడానికి 85 కోట్ల రూపాయలతో నివేదిక ప్రభుత్వానికి పంపామన్నారు. ఆ నిధులు మంజురై ఈ 2 ఆనకట్టలు పూర్తి అయితే శాశ్వతంగా 365 రోజులు నీరు ఉంటుందన్నారు. తద్వార రెండు పంటలు సులువుగా పండించుకోగలుగుతారన్నారు. దీంతో వాటర్ లెవెల్ కూడా పెరుగుతుందని అన్నారు. సాగునీటి సంఘాల ఈ పనుల విషయంలో ప్రాధాన్యత కల్పించుకొని సంఘ సభ్యులు, ప్రభుత్వ అధికారులు సమన్వయమై ఆయకట్టు పరిధిలో ఏది అవసరమో నిర్ణయించు కోవాలన్నారు. ముఖ్యంగా గేట్లు దగ్గరుండి తయారు చేయించుకోవాలన్నారు. ఫారెస్ట్ అధికారులతో మాట్లాడి మొక్కలు నాటి మంచి పార్కు, చిన్న ట్యాంక్ బండ్ ఏర్పాటు చేసుకొని గ్రామస్తులు ఆహ్లాదంగా గడిపే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. అలాగే మిగిలిన పనులు ఏమైనా ఉంటే జిల్లా కలెక్టర్ కి తెలియజేస్తామన్నారు. అనంతరం ఎల్లయ్య కాలువను ఎమ్మెల్యే రామకృష్ణ పరిశీలించారు.

Kancharla Media
Author: Kancharla Media

Leave a Comment