
తహసీల్దార్ గెడ్డం రవీంద్రనాథ్ ఠాగూర్,26 గ్రామాల్లో విస్తృతంగా ఇళ్ల గణన ప్రక్రియ,111 మంది సిబ్బంది, 19 మంది సూపర్వైజర్లతో ఇళ్ల గణన 20వ తేదీలోపు గణన పూర్తి చేయాలి.
కాజులూరు మండలంలోని అన్ని గ్రామాల్లో ఇళ్ల గణన కార్యక్రమాన్ని సమర్థవంతంగా, పకడ్బందీగా నిర్వహించాలని తహసీల్దార్ గెడ్డం రవీంద్రనాథ్ ఠాగూర్ అధికారులను ఆదేశించారు. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన గృహ గణన కార్యక్రమం ప్రజల సామాజిక, ఆర్థిక పరిస్థితులపై సమగ్ర సమాచారం సేకరించేందుకు ఎంతో కీలకమని ఆయన పేర్కొన్నారు.కాజులూరు మండలంలోని 26 గ్రామాల్లో ఈ గణన కార్యక్రమం కొనసాగుతోందని, ఇందుకోసం 111 మంది సిబ్బంది, 19 మంది సూపర్వైజర్లను నియమించినట్లు తెలిపారు. ప్రతి ఇంటిని సందర్శించి కుటుంబ సభ్యుల వివరాలు, నివాస పరిస్థితులు, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ పథకాల లబ్ధి వంటి అంశాలను ఖచ్చితంగా నమోదు చేయాలని సూచించారు.గణన ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు చోటుచేసుకోకుండా సిబ్బంది బాధ్యతాయుతంగా పనిచేయాలని, ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలని తహసీల్దార్ సూచించారు. గ్రామాల వారీగా కేటాయించిన ప్రాంతాల్లో గణనను వేగవంతం చేసి ఈ నెల 20వ తేదీలోపు పూర్తి చేయాలని ఆదేశించారు.ఇళ్ల గణన కార్యక్రమాన్ని మంగళవారం మంజేరు , శీల , కాజులూరులో పరిశీలించారు. గణన నిర్వహిస్తున్న సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకుని, నమోదు ప్రక్రియను పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి సరైన సమాచారాన్ని నమోదు చేయాలని, ఎవరూ గణనకు దూరం కాకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వానికి సరైన గణాంకాలు అందేలా అధికారులు సమన్వయంతో పని చేయాలని పేర్కొన్నారు.
ఇళ్ల గణన ద్వారా గ్రామాల అభివృద్ధి ప్రణాళికలు రూపొందించడంలో, సంక్షేమ పథకాల అమలులో, మౌలిక వసతుల కల్పనలో ప్రభుత్వానికి స్పష్టమైన సమాచారం అందుతుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో రెవెన్యూ సిబ్బంది బాలాజీ, శివకుమార్ ,సుబ్బారెడ్డి, పంచాయతీ కార్యదర్శులు శ్రీనివాస్ , బి హేమాదేవి , కే ఈశ్వరి, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు…



