
పిఠాపురం :- ప్రతి వాహనదారుడు ట్రాఫిక్ నియమాలను నిబంధనల ప్రకారం పాటించాలని,ఉల్లంఘించిన వారిపై చట్టపరమైన చర్యలు తప్పవని పిఠాపురం సర్కిల్ ఇన్‌స్పెక్టర్ జి శ్రీనివాస్ హెచ్చరించారు. ఆదివారం ఉప్పాడ బీచ్ రోడ్డు వద్ద నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ..ద్విచక్ర వాహనదారులు తమ ప్రాణ రక్షణ కోసం విధిగా నాణ్యమైన హెల్మెట్ ధరించాలని సూచించారు.బైక్‌లపై ముగ్గురు ప్రయాణించడం నిబంధనలకు విరుద్ధమని,దీనివల్ల వాహనం అదుపు తప్పి ప్రమాదాలు జరుగుతాయని పేర్కొన్నారు.ముఖ్యంగా మద్యం సేవించి వాహనం నడపడం నేరమని,అటువంటి వారిపై కేసులు నమోదు చేయడంతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని స్పష్టం చేశారు.వాహనం నడుపుతున్నప్పుడు మొబైల్ ఫోన్ వాడటం వల్ల ఏకాగ్రత దెబ్బతిని ఘోర ప్రమాదాలు సంభవిస్తున్నాయని,అలాగే అతివేగంగా వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలను ప్రమాదంలో పడేయకూడదని హెచ్చరించారు.ఈ నిబంధనలను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా పాటించాలని కోరారు.ఈ కార్యక్రమంలో యు.కొత్తపల్లి ఎస్సై వెంకటేష్,పోలీసు సిబ్బంది పాల్గొని వాహనదారులకు అవగాహన కల్పించారు…



