
కాకినాడ :- కాకినాడ జిల్లా ఎస్పీ జి.బిందుమాధవ్ ఆదేశాల మేరకు జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలో రౌడీ షీటర్లకు ప్రత్యేక కౌన్సిలింగ్ ఆదివారం నిర్వహించారు.ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ రౌడీ షీటర్లు తమ పాత నేర ప్రవృత్తిని వీడి సమాజంలో సత్ప్రవర్తనతో మెలగాలని, అసాంఘిక కార్యకలాపాలకు,భూ సెటిల్మెంట్లకు,ఇతర గొడవలకు దూరంగా ఉండాలని స్ట్రాంగ్ వార్నింగ్ తో కూడిన హెచ్చరిక చేసారు.ప్రతి ఒక్కరి కదలికల పై నిరంతరం నిఘా ఉంటుందని,ఎవరైనా శాంతి భద్రతలకు భంగం కలిగించినా లేదా ప్రజలను భయభ్రాంతులకు గురిచేసినా వారిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసు కుంటామని వారు హెచ్చరించారు…



